Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం
కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా అక్క ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. 60 ఏళ్ల రాజేశ్వరిబెన్ షా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుది శ్వాస విడిచారు. తన అక్క రాజేశ్వరిబెన్ షా మరణవార్త అందుకున్న అమిత్ షా గుజరాత్‌లో తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. హుటాహుటిన ముంబైకి చేరుకున్నారు. ముంబైలోని థాల్తేజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం గాంధీనగర్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది.