'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్
యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ అత్తగారు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు సుధా మూర్తి ఆసక్తిక కామెంట్స్ చేశారు. తన కుమార్తె అక్షతా మూర్తి ఆమె భర్తను ప్రధాన మంత్రిని చేసిందని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో అత్యంత పిన్న వయసులో ప్రధానమంత్రి అయిన సునక్ త్వరగా అధికారంలోకి రావడానికి కారణం తన కూతురు అని సుధా మూర్తి పేర్కొన్నారు. తాను తన భర్తను వ్యాపారవేత్తను చేశానని, రిషి సునక్‌ను మాత్రం అక్షర ఏకంగా ప్రధానిని చేసిందని, కేవలం భార్య మహిమ వల్లే జరిగినట్లు చెప్పారు. నారాయణ మూర్తి, సుధా మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని రిషి సునక్ 2009లో వివాహం చేసుకున్నారు. నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ టెక్ కంపెనీ వ్యవస్థాపకుడనే విషయం తెలిసిందే.
రిషి సునక్ ప్రతి గురువారం ఉపవాసం ఉంటారు: సుధా మూర్తి
రిషి సునక్ జీవితాన్ని తన కుమార్తె చాలా విధాలుగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా అతని ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని సుధా మూర్తి చెప్పారు. 150 ఏళ్లుగా వాళ్ల కుటుంబం ఇంగ్లండ్‌లో ఉంటున్నా రిషి సునక్ హిందూ మత విశ్వాసాలను చాలా భక్తితో నమ్ముతారని సుధా మూర్తి పేర్కొన్నారు. తమ అల్లుడితో పాటు అతని అమ్మ కూడా ప్రతి గురువారం ఉపవాసాలు ఉంటారని సుధా మూర్తి వెల్లడించారు. రిషి సునక్‌ను అక్షర పెళ్లి చేసుకున్నాక అతని ఆహార అలవాట్లను మార్చడమే కాకుండా, మత విశ్వాసాలు మరింత పెంపొందేలా చేసినట్లు గుర్తు చేశారు.