Delhi Police: జంతర్‌మంతర్ వద్ద నాన్నపై మూకదాడి.. చావు అంచుల దాకా వెళ్లారు: దిల్లీ పోలీసు కుమార్తె ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పలువురు పోలీసులు గాయపడినా, వారి పరిస్థితి, వారి కుటుంబాల బాధపై పెద్దగా చర్చ జరగడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఆందోళనల్లో గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు శుక్రవారం మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ ఘటనల వల్ల తమ కుటుంబాలు ఎదుర్కొన్న మానసిక వేదనను వివరిస్తూ, తమకూ న్యాయం జరగాలని కోరారు.
వివరాలు
నాన్నను లాగి.. మూకదాడికి యత్నం
దిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. తన తండ్రి గతంలో 15 సంవత్సరాలు భారత నౌకాదళంలో మెరైన్ కమాండోగా సేవలందించి, ప్రస్తుతం దిల్లీ పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల ఆందోళనల సమయంలో జంతర్‌మంతర్ వద్ద విధులు నిర్వహించిన ఆయన ప్రతి రోజు ఇంటికి వచ్చాక అక్కడి పరిస్థితులను కుటుంబ సభ్యులతో పంచుకునేవారని చెప్పారు.
ఆందోళనల్లో విద్యార్థుల పేరుతో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కూడా పాల్గొన్నట్లు తన తండ్రి చెప్పారని ఆమె పేర్కొన్నారు.
విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆయనను లాగి మూకదాడికి ప్రయత్నించారని, ఆ ఘటనలో తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు.
వివరాలు
నాన్నను లాగి.. మూకదాడికి యత్నం
దాదాపు నాలుగు గంటల పాటు ఆయన స్పృహలో లేకపోయారని, అనంతరం ఇంటికి తీసుకొచ్చినప్పుడు యూనిఫాం అంతా రక్తంతో తడిసిపోయి ఉండటాన్ని చూసి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు.
ఆ ఘటన తర్వాత సోషల్ మీడియా చూడగా తన తండ్రినే నిందిస్తూ పోస్టులు కనిపించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రిపై దాడి చేసిన వారే న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చూసిన తర్వాత, గాయపడిన పోలీసులకు కూడా న్యాయం జరగాల్సిందేనని భావించి ఇతర పోలీసు కుటుంబాలతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు.
వివరాలు
'రాళ్ల దాడిలో హెల్మెట్ కూడా విరిగిపోయింది'
దిల్లీ పోలీసు శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి భార్య సీమా మాట్లాడుతూ.. తన భర్త 33ఏళ్లుగా పోలీసు శాఖలో సేవలందిస్తున్నారని చెప్పారు.
ఆందోళనల సమయంలో కొందరు ఆయనపై రాళ్లు,చెప్పులు సహా చేతికి చిక్కిన వస్తువులతో దాడి చేశారని తెలిపారు.
రాళ్ల దాడి తీవ్రతకు ఆయన ధరించిన హెల్మెట్ కూడా విరిగిపోయిందని పేర్కొన్నారు.
ఆందోళనల అనంతరం మీడియాలో ఎక్కువగా ఆందోళనకారులపై పోలీసులు దాడి చేశారనే వార్తలే కనిపిస్తున్నాయని,కానీ విధుల్లో గాయపడిన పోలీసుల పరిస్థితి గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల భద్రత కోసం విధులు నిర్వహించే పోలీసుల త్యాగాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు కూడా దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
'సీనియర్ అధికారులను కాపాడుతూ గాయపడ్డారు'
మరో పోలీసు అధికారి కుమారుడు మాట్లాడుతూ.. తన తాత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో పనిచేసి 1971 యుద్ధంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.
ఆయన స్ఫూర్తితోనే తన తండ్రి పోలీసు శాఖలో చేరి ప్రస్తుతం అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆందోళనల సమయంలో బారికేడ్ల వద్ద విధుల్లో ఉన్నప్పుడు నిరసనకారులు ఒక్కసారిగా రాళ్ల దాడికి పాల్పడ్డారని, ఆ సందర్భంగా సీనియర్ అధికారులను రక్షించే ప్రయత్నంలో తన తండ్రి తలకు తీవ్ర గాయమై నాలుగు కుట్లు పడ్డాయని చెప్పారు.
తాను కూడా విద్యార్థినేనని, తన తండ్రి విద్యార్థుల పట్ల ఎప్పుడూ దురుసుగా వ్యవహరించరని స్పష్టం చేశారు.
అయితే ఆందోళనల్లో కొంతమంది రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు కూడా చొరబడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు.