తదుపరి వార్తా కథనం

Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. ఐదుగురికి గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 01, 2024
02:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆందోళనకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.
మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది కూడా మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బెంగళూరులో పేలుడు.. ఐదుగురికి గాయాలు
BREAKING: Blast inside Rameshwaram Cafe in Bengaluru (Whitefield branch), 4 persons sustain injuries. Details awaited on whether it was a cylinder blast or something else. @IndiaToday pic.twitter.com/qcpDtGWXXH
— Shiv Aroor (@ShivAroor) March 1, 2024
మీరు పూర్తి చేశారు