Page Loader
Indian Railways: నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు
నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు

Indian Railways: నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గంలో తొలిసారిగా ప్రయాణికుల రైలు శుక్రవారం నుంచి పట్టాలెక్కనుంది. న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య మొత్తం 46 కిలోమీటర్ల పొడవైన నూతన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం ద్వారా పిడుగురాళ్లను శావల్యాపురంతో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు కేంద్రం 2020 జూన్ 30న అనుమతిని ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ మార్గంలో కేవలం సరకుల రైళ్లే నడుస్తున్నాయి.

వివరాలు 

నాందేడ్ నుంచి ప్రత్యేక రైలు

తాజాగా, ప్రయాణికుల రైళ్ల నడపటానికి అధికారుల నుంచి అనుమతి లభించడంతో, వారానికి ఒకసారి ప్రయాణికుల రైలు నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నెమలిపురి,రొంపిచర్ల రైల్వే స్టేషన్లలో టికెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నడిపించనున్నారు. ఈ రైలు నడికుడి, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ, మార్కాపురం, దొనకొండ, కంభం, నంద్యాల మార్గంగా తిరుపతికి చేరుతుంది.