
Nafe Singh Rathi: హర్యానాలో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య.. కారుపై బుల్లెట్ల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గుర్యయారు.
ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలోని బహదూర్‌గఢ్‌లో ఆయన ఎస్‌యూవీపై దుండగులు తుపాలతో మెరుపుదాడి చేసి.. దుండగులు కాల్చి చంపారు.
ఈ తుపాకీ కాల్పుల్లో నఫే సింగ్ రాఠీతో పాటు అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని బ్రహ్మశక్తి సంజీవని ఆసుపత్రికి తరలించారు.
అయితే తీవ్రంగా గాయపడిన నఫే సింగ్ రాఠీ ఆస్పత్రికి చేరుకునే లోపే మరణించినట్లు INLD మీడియా సెల్ చీఫ్ రాకేష్ సిహాగ్ వెల్లడించారు.
హర్యానా
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు
ఈ ఘటనపై ఝజ్జర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అర్పిత్ జైన్ మాట్లాడుతూ.. కాల్పుల ఘటన గురించి మాకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు.
నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందుకోసం సీఐఏ, ఎస్టీఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు.
నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. నఫే సింగ్ రాఠీ హత్యతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.
అనేక బృందాలు సంఘటనా స్థలానికి చేసుకొని సాక్ష్యాలను సేకరిస్తున్నాయి.
ఈ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సన్నిహిత సహచరుడు కాలా జాతేడి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఆస్తి తగాదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.