Page Loader
నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం
నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం

నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం

వ్రాసిన వారు Stalin
Mar 02, 2023
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రకు నాందిపలికాయి. చరిత్రలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాగాలాండ్‌లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ)కి చెందిన సల్హౌతునో క్రూసే, హెకాని జఖాలు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలుపొందారు. పశ్చిమ అంగామి నుంచి క్రూసే, దిమాపూర్-3నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలు విజయం సాధించి, చరిత్రను తిరగరాశారు. ప్రస్తుత ఎన్నికల్లో నాగాలాండ్ అసెంబ్లీ బరిలో వివిధ పార్టీల నుంచి నలుగురు మహిళలు బరిలో నిలిచారు. ఎన్‌డీపీపీ నుంచి హెకానీ జఖాలు, క్రూసే, కాంగ్రెస్ నుంచి రోసీ థామ్సన్, బీజేపీ నుంచి కహులీ సెమా పోటీ చేశారు.

నాగాలాండ్

60ఏళ్ల తర్వాత దక్కిత ప్రాతినిధ్యం

స్థానిక హోటల్ యజమాని క్రూసే స్వతంత్ర అభ్యర్థి కెనీజాఖో నఖ్రోపై విజయం సాధించారు. ​క్రూసే గెలుపు కోసం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో ​విస్త్రత ప్రచారం చేశారు. జఖాలు దిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. అక్కడే ఆమె ఫ్యాకల్టీగా కూడా పని చేస్తున్నారు. 1963లో నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా లభించింది. 60మంది సభ్యుల ఉండే అసెంబ్లీకి 60ఏళ్ల చరిత్రలో ఇంత వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యేకు కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. మహిళలు ఎన్నికలకు పోటీ చేయలేదని కాదు కానీ వారు ఎన్నడూ గెలవలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు 60ఏళ్ల చరిత్రను తిరిగి రాశారు. మహిళా ఎమ్మెల్యేలను సగర్వంగా అసెంబ్లీ పంపారు.