Page Loader
Nagar Kurnool: వజ్రాల మడుగులో కృష్ణమ్మ.. నల్లమలలో ప్రకృతి కనువిందు 
వజ్రాల మడుగులో కృష్ణమ్మ.. నల్లమలలో ప్రకృతి కనువిందు

Nagar Kurnool: వజ్రాల మడుగులో కృష్ణమ్మ.. నల్లమలలో ప్రకృతి కనువిందు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ మండలానికి చెందిన పెద్దపులుల అభయారణ్యంలో కృష్ణమ్మ వంకలు తిరుగుతూ ప్రవహించే అందాన్ని చూస్తుంటే రెండు కన్నులు చాలవని అనిపిస్తుంది. వజ్రాల మడుగు వీక్షణ కేంద్రం వద్ద నుంచి చూస్తే నది అందాలు మనసు దోచేస్తాయి. లోయల్లో నీలి రంగులో పరుస్తున్న నది, పచ్చని కొండల మధ్య సాగుతూ నల్లమల అరణ్యానికి వాలుజడలా అలంకరించింది. ఇక్కడి చల్లని వాతావరణం మనసుకు తీపి హాయిని ఇస్తోంది. దోమలపెంట నుంచి సుమారు 10 కిలోమీటర్లు, శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వజ్రాల మడుగు మార్గంలో ఈ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. అయితే, అక్కమహాదేవి టూరిజం ప్యాకేజీలో వెళ్లే పర్యాటకులను మాత్రమే ఈ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు.