Loading...
Karnataka SIR: నందన్‌ నీలేకని,నిఖిల్‌ కామత్‌.. కర్ణాటక SIR నోటీసుల జాబితాలో!
నందన్‌ నీలేకని,నిఖిల్‌ కామత్‌..కర్ణాటక SIR నోటీసుల జాబితాలో!

Karnataka SIR: నందన్‌ నీలేకని,నిఖిల్‌ కామత్‌.. కర్ణాటక SIR నోటీసుల జాబితాలో!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాత ఓటర్ల జాబితాలోని వివరాలతో ప్రస్తుత సమాచారం సరిపోలకపోవడం వంటి కారణాలతో పలువురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని,ఆయన కుటుంబ సభ్యులు, జెరోదా వ్యవస్థాపకులు నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నందన్‌ నీలేకని,ఆయన కుటుంబ సభ్యుల పేర్లు 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాప్‌ కాని(అన్‌మ్యాప్డ్‌) కేటగిరీలో నమోదయ్యాయి. మరోవైపు బెంగళూరు సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌, వారి తల్లి రేవతి కామత్‌కు సంబంధించిన వివరాల్లో తల్లిదండ్రుల పేర్లు సరిపోలలేదని గుర్తించారు.

వివరాలు 

డీకే శివకుమార్‌ తల్లి పేరులోనూ 'సెల్ఫ్‌-నేమ్‌ మిస్‌మ్యాచ్‌'

కనకపుర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తల్లి గౌరమ్మ పేరులోనూ 'సెల్ఫ్‌-నేమ్‌ మిస్‌మ్యాచ్‌' ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా ఇలాంటి తేడాలను అధికారులు గుర్తిస్తున్నారు.

అయితే,ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ వల్ల ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

అవసరమైన పరిశీలన కోసం సంబంధిత సిబ్బంది వారి వద్దకే వెళ్లి ప్రక్రియను పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.

వివరాలు 

సీఎన్‌ఆర్‌ రావుకూ SIR ప్రక్రియలో ఇబ్బందులు

ఇదిలా ఉండగా, పేరులో స్వల్ప వ్యత్యాసం కారణంగా భారతరత్న,ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌ రావుకూ SIR ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైనట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అయితే, పాత ఓటర్ల జాబితాతో పోల్చినప్పుడు ఆయన పేరులో కొంత తేడా ఉన్నప్పటికీ.. సీఎన్‌ఆర్‌ రావుకు ఎలాంటి నోటీసూ జారీ చేయలేదని గ్రేటర్‌ బెంగళూరు ప్రధాన కమిషనర్‌ ఎం. మహేశ్వరరావు స్పష్టం చేశారు.

ADVERTISEMENT