గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 'నాణ్యత' యాప్
ఈ వార్తాకథనం ఏంటి
నగరంలో నీటి నాణ్యత, సరఫరా, కాలుష్యంపై ప్రజలు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్&ఎస్‌బీ) కొత్త యాప్‌ను రూపొందించింది.
ఆ యాప్‌కు 'నాణ్యత'గా నామకరణం చేశారు. 'నాణ్యత' యాప్ ద్వారా ప్రజలే నేరుగా నీటి నాణ్యతను పరీక్షించి అధికారులు ఫిర్యాదు చేయొచ్చు.
దీనికి సంబంధించిన మెజర్‌మెంట్లపై ప్రజలకు హెచ్ఎండబ్ల్యూఎస్&ఎస్‌బీ అవగాహన కల్పించనుంది.
నీటి నాణ్యతను కొలిచే ప్రత్యేక కిట్లను కూడా ప్రజలకు హైదరాబాద్ జలమండలి అందించనుంది.
ఇప్పటికే ఈ యాప్‌ను డివిజన్ 6లో విజయవంతంగా పరీక్షించారు.
త్వరలోనే ఎంపిక చేసిన కమ్యూనిటీల్లో యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఆ తర్వాత నగర వ్యాప్తంగా పరీక్షించనున్నారు.
హైదరాబాద్
వార్డుల వారీగా ప్రజలకు ప్రత్యేక శిక్షణ
'నాణ్యత' యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత వార్డుల వారీగా అధికారుల ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 80లక్షల మందికి జలమండలి తాగు నీటిని సరఫరా చేస్తోంది. అయితే హైదరాబాద్‌లో రిజర్వాయర్లు లేకపోవడం, పైపులు లీకేజీ ఏర్పడం వల్ల నీరు కాలుష్య కావడం జరుగుతోంది.
దీంతో నీటి కాలుష్యంపై ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక వైపు జలమండలి పరిధి పెరగడం, మరోవైపు సిబ్బంది తగినంత లేకపోవడంతో సమస్యను పరిష్కరించడానికి హెచ్ఎండబ్ల్యూఎస్&ఎస్‌బీ ఇబ్బంది పడుతోంది.
ఇందుకోసం ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జలమండలి 'నాణ్యత' యాప్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.