LOADING...
Nara Bhuvaneshwari: రెండు రంగాల్లో నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గుర్తింపు
రెండు రంగాల్లో నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గుర్తింపు

Nara Bhuvaneshwari: రెండు రంగాల్లో నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగుప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు తెలుగు వలసదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమానికి కూడా హాజరుకానున్నారు. నవంబర్‌ 4న లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ పురస్కారాలను అందుకోనున్నారు. మొదటగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఆమె చేసిన ప్రజాసేవా కార్యక్రమాలు, సామాజిక ప్రభావం రంగాల్లో అందించిన విశేష సేవలను గుర్తిస్తూ 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డుతో సత్కరించనున్నారు.

Details

రెండు అవార్డులు

ఈ అవార్డు ద్వారా భువనేశ్వరి సామాజిక సేవా రంగంలో చేసిన కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. అదేవిధంగా, ఆమె ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 'గోల్డెన్ పీకాక్ అవార్డు (Golden Peacock Award)' అందజేయనున్నారు. ఈ పురస్కారాన్ని ఆమె హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (VCMD) హోదాలో స్వీకరించనున్నారు. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని భువనేశ్వరికి మద్దతుగా ఉండనున్నారు. ఈ రెండు పురస్కారాలు భువనేశ్వరి సామాజిక సేవా, వ్యాపార పరిపాలనా రంగాల్లో చూపిన ప్రతిభకు గ్లోబల్ గుర్తింపుని తెచ్చిపెట్టనున్నాయి.