LOADING...
Nara Lokesh Australia Tour: ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ రంగ పెట్టుబడులకు నారా లోకేష్ ఆహ్వానం
ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ రంగ పెట్టుబడులకు నారా లోకేష్ ఆహ్వానం

Nara Lokesh Australia Tour: ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ రంగ పెట్టుబడులకు నారా లోకేష్ ఆహ్వానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో ఫోరం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేశ్ సిడ్నీలో ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతోతో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్‌మెంట్‌ ఎజెండాలో చేర్చడం కోసం లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సహకరించారు. లోకేష్ ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులలో ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో—ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించగలిగేలా ప్రత్యేకతలను చర్చించారు.

Details

కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు సహకారం

తదుపరి సీఈవో ఫోరం సెషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రాధాన్యత కలిగిన భాగస్వామ్య రాష్ట్రంగా గుర్తించి, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను ప్రదర్శించాలని సూచించారు. ఆయన 'ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ - గేట్ వే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా' అనే అంశంపై ఉమ్మడి నివేదికలకు అవకాశం కల్పించాలన్నారు. కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు సహకారం కోరారు. అలాగే నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి హాజరుకావాలని ఆహ్వానించారు.

Details

పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు

మెక్ కే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్ట్రేలియా-భారత మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి 2012లో ఫోరంను ప్రారంభించగా, ఇరుదేశాల అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, వలసలపై ఫోరం దృష్టి సారిస్తోందని, $48.4 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంచడంలో మద్దతు అందిస్తోందని చెప్పారు. అలాగే విధానపరమైన సహకారాన్ని సులభతరం చేయడానికి సీఐఐతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు.