Nara Lokesh: భారత్‌లో పెట్టుబడులకు గేట్‌వే ఏపీ: మంత్రి లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ ప్రధాన గమ్యస్థానంగా మారిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్ బ్రిస్బేన్‌లో నిర్వహించిన బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య సుహృద్భావపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం నిరంతరంగా కొనసాగుతోందని చెప్పారు. ఏపీలో "స్పీడ్ ఆఫ్ డూయింగ్","ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. గత 16 నెలల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. విశాఖపట్టణంలో రూ.1.33 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని వివరించారు.
వివరాలు
నవంబర్ 14, 15 తేదీల్లో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025
పారిశ్రామిక వేత్తల కోసం ఏపీలో అనుకూల వాతావరణం, సులభతర విధానాలు అమలులో ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ఆర్సెలార్ మిత్తల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్ల వ్యయంతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు సిద్ధమవుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెట్టుబడులకై ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన గేట్‌వేగా ఎదుగుతోందని అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించబోయే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025 కార్యక్రమానికి ఆస్ట్రేలియా పారిశ్రామిక వేత్తలు తప్పక హాజరుకావాలని లోకేశ్ ఆహ్వానించారు.