జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న చర్చ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినపుడు ఈ చర్చ ఎక్కువగా జరిగింది. అయితే రాజకీయ రంగప్రవేశం గురించి ఎన్టీఆర్ ఎప్పుడూ కామెంట్ చేయలేదు. 2009ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారానికి వచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా నారా రోహిత్ వ్యాఖ్యల కారణంగా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చర్చలు జరుగుతున్నాయి. నారా లోకేష్ తో యువగళం పాదయాత్రలో పాల్గొన్న నారా రోహిత్, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని, తెలుగు దేశం పార్టీలో జాయిన్ అవుతారని అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి.
రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తున్న నారా రోహిత్
రాజకీయాల్లోకి యువత రావాలనీ, ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ అన్నారు. ఇంకా ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడిన నారా రోహిత్, 2024అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని అన్నాడు. ప్రస్తుతం వచ్చిన ఎమ్మెల్సీ ఫలితాలే 2024 ఎమ్మేల్యే ఎన్నికల్లోనూ వస్తాయనీ, అది జీర్ణించుకోలేక తెలుగుదేశంపై బురద జల్లే ప్రయత్నం వైసీపీ చేస్తుందని కామెంట్ చేసారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాతో బిజీగా ఉన్నాడు. నిన్న గాక మొన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి సంవత్సరం టైమ్ తీసుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30మూవీ, వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది.