Vande Bharat: నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
నరసాపురం నుంచి కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. నరసాపురం స్టేషన్‌లో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ జెండా ఊపి రైలును అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి తదితర అధికారులు పాల్గొన్నారు. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను ఇటీవల రైల్వే బోర్డు నరసాపురం వరకు పొడిగించడానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, ఉదయం 5:30 గంటలకు చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరే వందేభారత్ రైలు, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల ద్వారా విజయవాడకు 11:40 గంటలకు చేరుకుంటుంది. ఇకపై ఈ రైలు గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురం వరకు సర్వీసులందించనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, ప్రభుత్వ విప్ నాయకర్ గారితో కలిసి నరసాపురం - చెన్నై సెంట్రల్ వందే భారత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. అనంతరం బైక్ ర్యాలీ లో పాల్గొని ట్రైన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ… pic.twitter.com/xbcFFPxumB
— Venigandla Ramu (@RamuVenigandla) December 15, 2025