Nashik TCS Case: అసభ్య పదాలతో పాస్‌వర్డ్‌లు.. టీసీఎస్ కేసులో షాకింగ్ విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
నాసిక్‌లోని టీసీఎస్ సంస్థలో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆ సంస్థ యూనిట్‌లో పాస్‌వర్డ్‌లను అసభ్య పదాలతో భద్రపరిచినట్టు వెల్లడైంది. ట్రైనింగ్ రోజుల నుంచే రజా మెమన్ అనే ఉద్యోగి తనపై మానసిక వేధింపులు, అనుచిత ప్రవర్తన కొనసాగించాడని బాధితురాలు తెలిపింది. తన కేబిన్‌కు పిలిచి అసభ్యంగా మాట్లాడేవాడని, తన మత భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసేవాడని ఆరోపించింది. మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులు ఆన్‌లైన్ ద్వారా వేధింపులకు గురి చేస్తూ తనపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపింది.
వివరాలు
ఏడుగురు ఉద్యోగుల అరెస్ట్
2022లో పెళ్లి చేసుకుంటానని చెప్పిమోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడని డానిష్ షేక్‌పై వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును బయటపడింది. అతను అప్పటికే వివాహితుడని పోలీసుల దర్యాప్తులో తేలింది.నిదాఖాన్ అనే నిందితురాలు బాధితురాలి మతంపై అవమానకర వ్యాఖ్యలు చేసి మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మరో ఏడుగురు మహిళలు ముందుకు వచ్చి తమపై కూడా మానసిక,లైంగిక వేధింపులు జరిగాయని,హెచ్ఆర్ విభాగం ఫిర్యాదులను పట్టించుకోలేదని చెప్పారు. ఈ ఘటనలు 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఒక పురుష ఉద్యోగి కూడా కార్యాలయంలో మత మార్పిడి ప్రయత్నం జరిగిందని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పోలీసులు ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.