Page Loader
Kaleshwaram Project: స‌వ‌రించేదాకా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల నింపొద్దు
స‌వ‌రించేదాకా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల నింపొద్దు

Kaleshwaram Project: స‌వ‌రించేదాకా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల నింపొద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్వెస్టిగేషన్లు పూర్తయ్యే వరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నింపవద్దని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ స్పష్టంగా సూచించింది. ''ఇన్వెస్టిగేషన్లు పూర్తయ్యాక, ఫలితాలను విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకోవాలి. అప్పటివరకు బ్యారేజీల్లో నీటిని నింపడం సరికాదు'' అని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసినట్లు సమాచారం. ''గత ఏడాది జులైలో జరిగిన సమావేశం తర్వాత బ్యారేజీలకు సంబంధించిన పరీక్షల్లో ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది.చేసిన పరీక్షల ఫలితాలను మాత్రమే పరిశీలించాం.అలాంటప్పుడు నీటిని నింపతామని ఎలా అంటారు?ఊహాజనితంగా మాట్లాడటం సరైంది కాదు'' అని ఎన్‌డీఎస్‌ఏ నిపుణులు ఒక ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కి సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

ఫలితాలను డిసెంబరులోగా ఇస్తాం 

మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల బ్యారేజీలలో ఇప్పటివరకు జరిగిన పరీక్షలు,వాటి ఫలితాలు, నీటిపారుదల శాఖ ప్రతిపాదనలపై శుక్రవారం దిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో పాటు ఇతర సభ్యులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇన్వెస్టిగేషన్లన్నీ పూర్తయ్యాక, ఫలితాలను డిసెంబరులోగా అందిస్తామని నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నీటిపారుదల శాఖ అధికారులకు వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం,''బ్యారేజీల వైఫల్యాలకు గల కారణాలను స్పష్టంగా వివరించి, భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలో కూడా సూచిస్తాం.బ్యారేజీల మోడల్ స్టడీస్‌తో పాటు ఇతర ఇన్వెస్టిగేషన్లు జరుపుతున్నందున, నీటిపారుదల శాఖ డిజైన్లు,డ్రాయింగ్‌లతో సిద్ధంగా ఉండాలి. నివేదిక రాగానే,పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తే, వచ్చే సీజన్‌లో బ్యారేజీలకు నీటిని నింపడానికి అవకాశం ఉంటుంది.

వివరాలు 

 నివేదిక వెంటనే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి:  అయ్యర్ 

జులైలో మాతో సమావేశం అనంతరం బ్యారేజీలకు వరద ప్రవాహం వచ్చింది. దీంతో అనుకున్న పరీక్షలన్నీ పూర్తి చేయలేకపోయాము. పూర్వపరీక్షలే పూర్తి కానప్పుడు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నింపితే ఎలాంటి సమస్యలు రాకపోతాయని చెప్పలేం'' అని ఆయన స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో నివేదిక ఇచ్చిన వెంటనే, దాని ప్రకారం పనులు ప్రారంభించడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అయ్యర్ సూచించినట్లు సమాచారం.