Loading...
Visakhapatnam: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు.. విశాఖలో భారీ వాక్‌థాన్
జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు.. విశాఖలో భారీ వాక్‌థాన్

Visakhapatnam: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు.. విశాఖలో భారీ వాక్‌థాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు దాని ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే ఉద్దేశంతో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాళీమాత ఆలయం వద్ద జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. పి. జగదీశ్వరరావు జెండా ఊపి ఈ వాక్‌థాన్‌ను ప్రారంభించారు. కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన వాక్‌థాన్‌ ఆర్కే బీచ్‌ మీదుగా వైఎంసీఏ వరకు కొనసాగింది. ర్యాలీ దారి పొడవునా విద్యార్థులు, వాలంటీర్లు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ బాటసారులకు నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

వివరాలు

నేత్రదానం పట్ల ప్రజల్లో చైతన్యం

నేత్రదానం పట్ల ప్రజల్లో చైతన్యం పెంచేలా సందేశాలను విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ అవగాహన ర్యాలీలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ వైద్య కళాశాలల విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ADVERTISEMENT