
పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో నూతన రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పచ్చజెండా ఉంది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతమైన పాడేరు-లంబసింగి రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పాడేరు, లంబసింగి ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
దాదాపు 48 కిలోమీటర్ల మేర పక్కా రోడ్డును నిర్మించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
ఆంధ్ర కశ్మీర్‌గా పిలుచుకునే లంబసింగిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ రోడ్డు నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ రూ.206కోట్లతో టెండర్ల ప్రక్రియను చేపడుతోంది. 2024 నాటికి ఈ రెండు వరుసల రోడ్డును పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.
పాడేరు
మరికొన్ని ప్రాజెక్టులకు ఆమోద ముద్ర
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ఆర్ఓబీని నిర్మించేందుకు కూడా కేంద్రం అమోదం తెలిపింది. సీతారామపురం-దత్తలూరు రహదారి వెంబడి ఈ ఆర్ఓబీని నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.545 కోట్లు కేటాయించింది.
ఇదిలా అంటే, పొట్టి శ్రీరాములు జిల్లాలోని సీతారామపురం-దత్తలూరు వరకు 36.40 కి.మీ రోడ్డును రెండు వరుసల రహదారిగా నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దీని కోసం రూ.267 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే మదనపల్లె సమీపంలో ఓ ఆర్‌డబ్ల్యూబీని నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది. రైల్వే క్రాసింగ్ వద్ద దీన్ని నిర్మించనుంది. దీనికి రూ.72.50 కోట్లను కేటాయించింది.