NEET PG 2025: వచ్చే ఏడాది జూన్ 15న నీట్ పీజీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 12, 2024
12:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ పీజీ-2025 పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు జులై 31, 2025 నాటికి ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేయాలి. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 52,000 పీజీ సీట్ల కోసం సుమారు 2 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీపడుతున్నారు. అలాగే, ర్యాగింగ్ నివారణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, 2021లో జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జాతీయ వైద్య మండలి వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది.