
Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన
ఈ వార్తాకథనం ఏంటి
బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన రాజకీయ జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును అధిగమించడం ద్వారా నవీన్ పట్నాయక్ రెండోస్థానానికి చేరుకున్నారు.
జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 23 సంవత్సరాల 138 రోజులు పనిచేశారు.
ఒడిశాకు వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నవీన్ పట్నాయక్ శనివారం(జులై 22)తో 23ఏళ్ల 139 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని జ్యోతీ బసును అధిగమించారు.
సిక్కిం మాజీ ముఖ్యమంత్రి, పవన్ కుమార్ చామ్లింగ్ అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉన్నారు.
పవన్ కుమార్ చామ్లింగ్ డిసెంబర్ 12, 1994 నుంచి మే 26, 2019 వరకు 25ఏళ్లకు పైగా సీఎంగా పనిచేశారు.
ఒడిశా
తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్ తన తండ్రి బిజూ పట్నాయక్ మరణం తర్వాత 1997 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
తన తండ్రి పేరు మీదుగా బిజూ జనతాదళ్‌ని స్థాపించి బిజూ పట్నాయక్ వారసుడిగా రాజకీయ రంగం ప్రవేశం చేశారు.
1997 నుంచి బిజూ జనతా దళ్ పార్టీకి అధ్యక్షుడికి నవీన్ పట్నాయక్ కొనసాగుతూ వస్తున్నారు.
1997 నుంచి 2000 వరకు అస్కా లోక్ సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినధ్య వహించారు.
1998 నుంచి 2000 వరకు ఉక్కు, గనుల శాఖకు కేంద్ర మంత్రిగా పని చేశారు.
2000, మార్చి 5న ఒడిశాలో బీజేపీతో కలిసి పట్నాయక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా ఐదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
ఒడిశా
2024 ఎన్నికల్లో గెలిస్తే చరిత్ర సృష్టించనున్న పట్నాయక్
2024 ఎన్నికల్లో బీజేడీకి చెందిన నవీన్ నాయకత్వంలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అవుతారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్, జ్ఞాన దేవి దంపతులకు నవీన్ 16 అక్టోబర్ 1946న కటక్‌లో జన్మించారు. అతను డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాయ్స్ స్కూల్‌లో చదువుకున్నారు.
పాఠశాల విద్య తర్వాత అతను ఢిల్లీ యూనివర్సిటీ కిరోరి మాల్ కాలేజీకి వెళ్లారు.
నవీన్ పట్నాయక్‌లో మంచి రచయిత. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐఎన్‌టీఏసీహెచ్) వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు.
నవీన్ పట్నాయక్ అక్క గీతా మెహతా ప్రముఖ రచయిత్రి