Amit Shah: 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం.. అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ, దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతా దళాలు భారీ విజయం సాధించాయని తెలిపారు.
2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని 'ఎక్స్' వేదికగా పునరుద్ఘాటించారు.
Details
నక్సలిజం అంతం దిశగా మరో అడుగు
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. అదేవిధంగా పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మానవత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నక్సలిజాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వీరి త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
2026 మార్చి 31 నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి చేసే సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాను.
ఇక నుంచి ఏ పౌరుడూ ఈ సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోకూడదని అమిత్ షా స్పష్టం చేశారు.
Details
భద్రతా దళాలకు సీఎం విష్ణుదేవ్ సాయ్ ప్రశంస
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ స్పందిస్తూ, భద్రతా బలగాల ధైర్యసాహసాలను కొనియాడారు.
తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సల్స్ వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నట్లు మీడియాతో వెల్లడించారు.
తాజా ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని రాయ్‌పుర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారు.