
ఎన్సీపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు; అజిత్ చూస్తుండగానే నియమించిన శరద్ పవార్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనలిస్ట్ కాంగ్రెస్ లో కొత్త తరహా పాలిటిక్స్ మొదలయ్యాయి. పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీలో కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించారు.
పవార్ కుమార్తె సుప్రియా సూలేతో పాటు సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ను పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అయితే ఆ పార్టీ కీలక నేత, పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కు మాత్రం పదవి దక్కలేదు.
ఎన్సీపీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముంబయిలో ఓ స్పెషల్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు.
ఈ వేదిక నుంచే పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను బయటపెట్టారు. కార్యక్రమంలో అజిత్ కళ్లఎదుటే ఈ ప్రకటన వెలువడటం కొసమెరుపు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్సీపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు
#WATCH | NCP chief Sharad Pawar appoints Praful Patel and Supriya Sule as working presidents of the party pic.twitter.com/v8IrbT9H1l
— ANI (@ANI) June 10, 2023