Page Loader
హిమాచల్​లో ఆకాశానికి చిల్లులు.. 51 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్
51 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్

హిమాచల్​లో ఆకాశానికి చిల్లులు.. 51 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 25, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్‌లో భీకర వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకుపోయిన 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. మండి జిల్లాలోని షెహ్ను గౌని, ఖోలానాల్ గ్రామాల వద్ద కురిసిన కుంభవృష్టితో జనం ప్రాణం భయంతో బెంబెలెత్తిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఎత్తైన భవనాలు కూలిపోయాయి. వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కులు జిల్లాలో ఆగస్ట్ 24న భారీ కొండచరియలు విరిగిపడి 9 వేల 924 ఇళ్లు దెబ్బతిన్నాయి. 300 దుకాణాలు, 4,783 గోశాలలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ తన నియోజకవర్గాన్ని సందర్శించారు. మండిలో ప్రజలకు రేషన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా సీఎం సుఖును కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సహాయక చర్యలను కొనసాగిస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ దళం