Page Loader
హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..  కుప్పకూలిన భారీ భవనాలు
కుప్పకూలిన భారీ భవనాలు

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..  కుప్పకూలిన భారీ భవనాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 24, 2023
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్‌ప్రదేశ్‌ను కొండచరియలు బెెంబెలెత్తిస్తున్నాయి. గురువారం కులు జిల్లాలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భారీ వాణిజ్య సముదాయాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. గురువారం నుంచి రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీచేసింది. భారీ వర్షాలతో కులు-మండీ ప్రాంతాలను కలిపే రహదారి దెబ్బతింది.ఈ క్రమంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.8,014 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ కొండచరియలు సృష్టించిన బీభత్సంపై సీఎం సుఖ్విందర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుప్పుకూలుతున్న భవనాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సీఎం సుఖ్విందర్ ట్వీట్