
హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, రాష్ట్రం మొత్తాన్ని ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు.
ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ లో 8100కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం నుండి విపత్తు సాయం 200కోట్లు అందిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి విపత్తు కారణంగా 346మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38మంది తప్పిపోయారు.
ప్రాణం కోల్పోయిన 346మందిలో 224మంది వర్షం కారణంగా ఏర్పడ్డ విపత్తుల వల్ల చనిపోతే మిగతా 117మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు.
మొత్తం 2216మంది ఇండ్లు వరదలో కొట్టుకుపోయాయి. 9819 నిర్మాణాలు పాక్షికంగా పాడయ్యాయి.
Details
హిమాచల్ ప్రదేశ్‌కు ఇతర రాష్ట్రాల సాయం
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ విభాగంలో రూ.2,712.19కోట్ల నష్టం వాటిల్లింది. జలశక్తి విభాగానికి రూ.1860.52కోట్ల నష్టం వచ్చింది. ఇంకా విద్యుత్ విభాగానికి రూ.1707.35 కోట్లు, గ్రామీణ అభివృద్ధి విభాగానికి రూ.369.53కోట్లు నష్టాలు వచ్చాయి.
వ్యవసాయ విభాగానికి రూ. 335.73కోట్లు, విద్యా విభాగానికి రూ.118.9కోట్లు, హార్టికల్చర్ విభాగానికి రూ.173.3కోట్లు నష్టం వాటిల్లింది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు తలా రూ.15కోట్ల సాయం అందించగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.11కోట్ల సాయం అందించింది.
కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.