తదుపరి వార్తా కథనం
NDRF: తుపాన్ ప్రభావిత 6 జిల్లాలకు తరలిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 26, 2025
09:17 am
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు శనివారం రాత్రి తరలివెళ్లాయి. మొత్తం 30 మంది సిబ్బందితో కూడిన ఆరు ప్రత్యేక బృందాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు పంపించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ప్రసన్నకుమార్ సిబ్బందికి తుపాన్ పరిస్థితుల్లో చేపట్టాల్సిన రక్షణ, సహాయక చర్యలపై పలు ముఖ్య సూచనలు చేశారు.