LOADING...
NEET Paper Leak Case: నీట్ ప్రశ్నపత్రం లీక్‌లో బ్యుటీషియన్ కీలక పాత్ర.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు
సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

NEET Paper Leak Case: నీట్ ప్రశ్నపత్రం లీక్‌లో బ్యుటీషియన్ కీలక పాత్ర.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో వేలాది మంది విద్యార్థులు,వారి కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వస్తున్న వివరాలు సంచలనంగా మారుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ వెనక ఓ బ్యుటీషియన్ కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఆమెను మహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల మనీషా వాఘ్మారేగా గుర్తించారు. పుణెలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మనీషా వాఘ్మారేను మే 14న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె దర్యాప్తు సంస్థ అదుపులో ఉంది. ఆమె అరెస్టు జరిగిన రోజే రసాయన శాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

మొత్తం వ్యవహారంలో వాఘ్మారే పాత్ర అత్యంత కీలకం 

ఆ తర్వాత రోజు వృక్షశాస్త్ర అధ్యాపకురాలు మనీషా గురునాథ్ మందరేను అరెస్టు చేశారు. నీట్ ప్రశ్నపత్రాల తయారీ బృందంలో సభ్యురాలిగా ఉన్న మనీషా గురునాథ్ మందరేకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ప్రశ్నపత్రాలపై ప్రవేశాధికారం ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆమె, వాఘ్మారే, కులకర్ణి సహా మరికొందరు కలిసి ముందస్తుగా కుట్ర పన్ని, పరీక్షలో వచ్చే ప్రశ్నలను భారీ మొత్తంలో డబ్బు చెల్లించగలిగిన విద్యార్థులకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో వాఘ్మారే పాత్ర అత్యంత కీలకమని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రశ్నపత్రాల తయారీలో మనీషా గురునాథ్ ప్రమేయం ఉన్న విషయం తెలుసుకున్న వాఘ్మారే, ఆమెతో కలిసి లీక్‌కు ప్రణాళిక రచించినట్లు సమాచారం. అనంతరం ఈ పథకంలో కులకర్ణిని కూడా భాగస్వామిని చేశారు.

వివరాలు 

రూ.10లక్షల చొప్పున ఒప్పందాలు

ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసే విద్యార్థుల కోసం వాఘ్మారే ప్రత్యేకంగా ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో కొందరు విద్యార్థులతో ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈవ్యవహారాన్ని ఆమె తన స్నేహితుడు ధనంజయ్ లోఖండేతో కూడా పంచుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఆ తర్వాత ధనంజయ్, నాసిక్‌లో కౌన్సెలింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న శుభమ్ ఖైర్నార్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ కేసులో మొదట అరెస్టు అయిన వారిలో శుభమ్ ఒకరు. పరీక్ష రద్దు నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాఘ్మారే నుంచి ప్రశ్నపత్రాలు ముందుగా ధనంజయ్‌కు,అక్కడి నుంచి శుభమ్‌కు చేరినట్లు దర్యాప్తులో బయటపడింది. అనంతరం గురుగ్రామ్,జైపూర్ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లకు అతడు పీడీఎఫ్ రూపంలో ప్రశ్నపత్రాలను పంపినట్లు సీబీఐ గుర్తించింది.

Advertisement

వివరాలు 

మరో అరెస్టు

నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో మరో కీలక అరెస్టు జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన రేణుకై రసాయన శాస్త్ర శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రశ్నపత్రం లీక్ చేసి ఇతరులకు చేరవేసిన ముఠాలో శివరాజ్ సభ్యుడిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో అతడి వద్ద నిర్వహించిన సోదాల్లో మొబైల్ ఫోన్‌లో లీకైన ప్రశ్నపత్రం లభ్యమైనట్లు సమాచారం. దాంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

Advertisement