LOADING...
NEET: మే 3న నీట్‌ యూజీ-2026 పరీక్ష : ఎన్‌టీఏ
మే 3న నీట్‌ యూజీ-2026 పరీక్ష : ఎన్‌టీఏ

NEET: మే 3న నీట్‌ యూజీ-2026 పరీక్ష : ఎన్‌టీఏ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ఎంబీబీఎస్‌,బీడీఎస్‌ సహా ఇతర వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ-2026 పరీక్ష తేదీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఖరారు చేసింది. ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నట్లు ఆదివారం వెల్లడించింది. అదే సమయంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలిపింది. అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఈ పరీక్ష మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

వివరాలు 

తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 13 భాషల్లో పరీక్ష

తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు రుసుముగా జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1,700, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు తదితరులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్‌ కార్డు వంటి ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Advertisement