NEET-UG 2026 paper leak: నీట్-యూజీ 2026 లీక్.. కీలక సూత్రధారి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని ఛేదించినట్లు ప్రకటించింది. ఈకేసులో కీలక పాత్ర పోషించిన పూణేకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా కులకర్ణికి జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ పరీక్షా విధానంతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. పరీక్షా ప్రక్రియలో భాగస్వామిగా ఉన్న అతనికి నీట్ ప్రశ్నాపత్రాలపై నేరుగా చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్షకు ముందే రసాయన శాస్త్ర ప్రశ్నాపత్రంలోని కొన్ని భాగాలను కులకర్ణి బయటకు పంపినట్లు విచారణలో తేలిందని సీబీఐ వెల్లడించింది. ఈఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని,మరికొందరి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రసాయన శాస్త్ర అధ్యాపకుడు అరెస్ట్
CBI has arrested P. V. Kulkarni, identified as the kingpin in the NEET-UG 2026 paper leak case. Investigators said the Chemistry lecturer, who had access to exam papers through the NTA process, conducted special coaching classes in Pune where leaked questions and answers were… pic.twitter.com/KnTHQzedC8
— IANS (@ians_india) May 15, 2026