
Chandrababu: నెల్లూరు హత్య ఘటన.. లక్ష్మీనాయుడు కుటుంబానికి సీఎం చంద్రబాబు పరిహారం
ఈ వార్తాకథనం ఏంటి
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సచివాలయ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, లక్ష్మీనాయుడు హత్య ఘటన అమానవీయమని, అమానుషమని వ్యాఖ్యానించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదనంగా, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసు విచారణ వేగంగా జరగేలా చూడాలని ఆదేశించారు.
Details
పిల్లల చదువు ప్రభుత్వ బాధ్యత
ప్రభుత్వం లక్ష్మీనాయుడు కుటుంబానికి సమర్థవంతమైన పరిహారం అందించనుంది. మృతుని భార్యకు రెండెకరాల భూమి మరియు రూ.5 లక్షల నగదు, ఇద్దరు పిల్లలకు రెండెకరాల భూమి, రూ.5 లక్షల ఫిక్సడ్ డిపాజిట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, లక్ష్మీనాయుడు పిల్లలను చదివించేందుకు ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుందని ప్రకటించారు. కారు దాడిలో గాయపడిన వ్యక్తులకు కూడా పరిహారం ఇచ్చారు. పవన్‌కు 4 ఎకరాలు భూమి, రూ.5 లక్షల నగదు, భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు ఇవ్వాలని సీఎం ప్రకటించారు.