LOADING...
MK Stalin: ఎన్ఈపీ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం స్టాలిన్ గట్టి వార్నింగ్!
ఎన్ఈపీ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం స్టాలిన్ గట్టి వార్నింగ్!

MK Stalin: ఎన్ఈపీ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం స్టాలిన్ గట్టి వార్నింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రం మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. లోక్‌సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమిళనాడు ఎం.కె. స్టాలిన్ ఘాటుగా స్పందించారు. NEP 2020ని తమ రాష్ట్రంలో అమలు చేయమని స్పష్టంగా ప్రకటించిన ఆయన, కేంద్రం తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదన్నారు. విద్యార్థులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తారా లేదా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Details

నోరు అదుపులో పెట్టుకోవాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అతడికి క్రమశిక్షణ అవసరమని సీఎం స్టాలిన్ విమర్శించారు. తమిళనాడుకు రావాల్సిన నిధులను అడ్డుకోవడమే కాకుండా, ఎంపీలను కించపరచడం దురుసుగా వ్యవహరించడం అన్నారు. గతంలో తమిళ ప్రజలను అవమానించిన మంత్రి ఇప్పుడు మరోసారి అదే తీరుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని నిలదీశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నిధులను నిలిపివేయడం ద్వారా తమిళ ప్రజలను మోసం చేస్తున్నారని, తమ ఎంపీలను అనాగరికులుగా చూపిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.