కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్' మ్యాప్; నేపాల్ అభ్యంతరం
ఈ వార్తాకథనం ఏంటి
లుంబినీ, కపిల్వాస్తుతో సహా భారతదేశ పురాతన ప్రదేశాలను వర్ణించేలా కొత్త పార్లమెంటు భవనంలో గోడపై 'అఖండ భారత్' మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యాప్‌పై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
'అఖండ భారత్' మ్యాప్‌లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ భూభాగాలను కూడా పొందుపర్చారు. ఈ మ్యాప్‌పై నేపాల్‌లో నిరసనలు మొదలయ్యాయి.
ఈ పార్లమెంట్ ఏకీకృత భారతదేశానికి ప్రాతినిధ్యం వస్తున్నట్లు 'అఖండ భారత్' మ్యాప్ సూచిస్తున్నట్లు ఆదేశ రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి.
ప్రస్తుతం నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ భారత పర్యటనలో ఉన్నారు. మే 31 నుంచి జూన్ 4 వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఈ మాప్ అంశం తెరపైకి రావడం గమనార్హు.
నేపాల్
భారత్ వంటి దేశానికి ఇది తగదు: మాజీ ప్రధాని ఓలీ
భారత ప్రభుత్వంతో మాట్లాడి 'అఖండ భారత్' మ్యాప్‌లో నేపాల్ భూభాగాన్ని తొలగిచేలా చేయాలని ఆ దేశ రాజకీయ నాయకులు కమల్ దహల్‌ను డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశాన్ని లేవనెత్తిన వారిలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా ఉన్నారు. తమను తాము ప్రాచీనమైన, బలమైన దేశంగా, ప్రజాస్వామ్యానికి నమూనాగా భావించే భారత్ వంటి దేశం నేపాలీ భూభాగాలను తమ మ్యాప్‌లో కలపడం న్యాయం కాదని ఓలీ అన్నారు.
నేపాల్ నుంచి ఇండియాకు బయలు దేరేముందు దహల్ ఈ విషయంపై మాట్లాడారు.
అఖండ భారత్ మ్యాప్ వివాదాన్ని పరిష్కరించాలని భారత ప్రభుత్వాన్ని అడుగుతానని దహల్ మంగళవారం స్పష్టం చేశారు. మరి భారత ప్రభుత్వంతో మ్యాప్ వివాదంపై కమల్ దహల్ ఎప్పుడు చర్చిస్తారో చూడాలి.