Page Loader
Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ
Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

వ్రాసిన వారు Stalin
Dec 05, 2023
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

New Aarogyasri cards: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 1.42 కోట్ల కొత్త కార్డులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖపై జరిగిన సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలను ప్రజలు వినియోగించుకునేలా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద పేర్కొన్న వ్యాధులు, విధానాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌ఓల సేవలను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 వైద్యారోగ్య శాఖపై జరిగిన సమీక్ష