Loading...
New Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త అమృత్ భారత్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త అమృత్ భారత్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

New Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త అమృత్ భారత్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ వరకు కొత్త అమృత్ భారత్ వారపు ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. రైలు నంబర్లు 22363/22364గా నడిచే ఈ సర్వీసుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ధన్‌బాద్ నుంచి ఆగస్టు 22, 2026న, కోయంబత్తూర్ నుంచి ఆగస్టు 25, 2026న రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ మీదుగా పలు ముఖ్యమైన స్టేషన్లను కలుపుతుంది. బల్హార్షా,సిర్పూర్ కాగజ్‌నగర్,మంచిర్యాల,పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తిరుప్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. దీంతో తెలంగాణ, ఏపీ నుంచి దక్షిణ, తూర్పు భారతదేశంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

వివరాలు 

ధన్‌బాద్ - కోయంబత్తూర్ రైలు టైమింగ్స్

రైలు నంబర్ 22363 ధన్‌బాద్ - కోయంబత్తూర్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 4:10 గంటలకు ధన్‌బాద్‌లో బయలుదేరుతుంది. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటుంది.

గోమో: శనివారం సాయంత్రం 4:40 - 4:42 గంటలు

బల్హార్షా: ఆదివారం రాత్రి 9:10 - 9:15 గంటలు

సిర్పూర్ కాగజ్‌నగర్: రాత్రి 10:04 - 10:05 గంటలు

మంచిర్యాల: రాత్రి 10:44 - 10:45 గంటలు

పెద్దపల్లి: రాత్రి 11:09 - 11:10 గంటలు

వరంగల్: సోమవారం అర్ధరాత్రి 12:08 - 12:10 గంటలు

మహబూబాబాద్: రాత్రి 1:09 - 1:10 గంటలు

ఖమ్మం: రాత్రి 1:49 - 1:50 గంటలు

విజయవాడ: తెల్లవారుజామున 3:45- 3:55 గంటలు

వివరాలు 

కోయంబత్తూర్ - ధన్‌బాద్ రైలు టైమింగ్స్

తిరుప్పూర్: సోమవారం సాయంత్రం 5:03 - 5:05 గంటలు

కోయంబత్తూర్: సోమవారం సాయంత్రం 6:30 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 22364 కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 7:50 గంటలకు కోయంబత్తూర్‌లో బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1:00 గంటలకు ధన్‌బాద్ చేరుకుంటుంది.

తిరుప్పూర్: మంగళవారం ఉదయం 8:28 - 8:30 గంటలు

విజయవాడ: మంగళవారం రాత్రి 9:40 - 9:50 గంటలు

ఖమ్మం: రాత్రి 11:39 - 11:40 గంటలు

మహబూబాబాద్: బుధవారం అర్ధరాత్రి 12:09 - 12:10 గంటలు వరంగల్: రాత్రి 1:18 - 1:20 గంటలు

ADVERTISEMENT

వివరాలు 

కోయంబత్తూర్ - ధన్‌బాద్ రైలు టైమింగ్స్

పెద్దపల్లి: తెల్లవారుజామున 3:59 - 4:00 గంటలు

మంచిర్యాల: ఉదయం 4:49 - 4:50 గంటలు

సిర్పూర్ కాగజ్‌నగర్: ఉదయం 5:19 - 5:20 గంటలు

బల్హార్షా: ఉదయం 7:00 - 7:05 గంటలు

గోమో: గురువారం ఉదయం 11:48 - 11:50 గంటలు

ధన్‌బాద్: గురువారం మధ్యాహ్నం 1:00 గంటలకు చేరుకుంటుంది.

తెలుగు రాష్ట్రాల మీదుగా సాగే ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్యమైన పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించనుంది. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు సుదూర ప్రయాణాల్లో మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ADVERTISEMENT