LOADING...
New blood group: భారత మహిళలో కనిపించిన కొత్త రక్త గ్రూప్‌.. వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం!
భారత మహిళలో కనిపించిన కొత్త రక్త గ్రూప్‌.. వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం!

New blood group: భారత మహిళలో కనిపించిన కొత్త రక్త గ్రూప్‌.. వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక దక్షిణ భారతీయ మహిళ ప్రపంచ వైద్య చరిత్రలో అరుదైన రక్తపు గుణంతో గుర్తింపు పొందారు. బెంగళూరులోని వైద్యులు ఆమెకు ఇప్పటివరకు ఎవరిలోనూ కనిపించని రక్తపు గ్రూప్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వింత గుణాన్ని గుర్తించేందుకు 10 నెలల పాటు పరీక్షలు నిర్వహించారు. సర్జరీ కారణంగా అరుదైన రక్త గుణం గుర్తింపు 38 ఏళ్ల మహిళ గతేడాది హృదయ శస్త్రచికిత్స కోసం కోలార్ జిల్లా ఆర్‌.ఎల్‌. జలప్ప హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు అవసరమైన రక్తాన్ని సేకరించేందుకు శాంపిల్స్‌ను పరీక్షించగా.. అందుబాటులో ఉన్న అన్ని రక్త నమూనాలతో ఆమె రక్తం 'పాన్‌ రియాక్టివ్‌'గా స్పందించింది. అంటే.. ఏ రక్తం కూడా సరిపోవడం లేదన్నమాట. దీంతో అవసరమైన రక్తపరీక్షలు చేయాల్సి ఉంది.

Details

CRIB గుర్తింపు.. భారత శాస్త్రవేత్తల విజయం

దీంతో శస్త్రచికిత్స సమయంలో రక్త మార్పిడి అవసరమే లేకుండా ఇతర ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు ఉపయోగించి చికిత్స విజయవంతంగా ముగించారు. ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఆమె రక్త నమూనాలను బ్రిస్టల్‌, యూకేలోని ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబ్‌కు పంపారు. 10 నెలల విశ్లేషణ అనంతరం శాస్త్రవేత్తలు ఆమె రక్తంలో క్రోమర్ సిస్టమ్‌లోకి చెందే కొత్త యాంటిజన్‌ను గుర్తించారు. దీన్ని CRIB (Cromer India Bengaluru) అనే పేరుతో 2025 జూన్‌లో మిలాన్‌లో అధికారికంగా ప్రకటించారు.

Details

 ప్రపంచంలో ఇదే తొలి కేసు

ఇండియన్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ (ISBT) మార్గదర్శకాల ప్రకారం, ఆమె CRIB యాంటిజన్‌ను కలిగిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. రోటరీ టీం అరుదైన రక్తదాతల కోసం ప్రయత్నాలు ఈ అరుదైన గుర్తింపుతో భారత్‌ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని రోటరీ బ్లడ్ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 2,100 మందికి పైగా అరుదైన రక్తదాతలతో రిజిస్ట్రీని తయారు చేశారు. వీరిలో 21 మంది D--, Rh null వంటి అరుదైన రక్తగ్రూప్స్ కలిగి ఉన్నారు.