LOADING...
TG GOVT ON Breakfast Scheme: తెలంగాణలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం... మొదట ఎక్కడంటే? 
తెలంగాణలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం... మొదట ఎక్కడంటే?

TG GOVT ON Breakfast Scheme: తెలంగాణలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం... మొదట ఎక్కడంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. భాగ్యనగరంలో సోమవారం నుండి ప్రజలకు రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది. మోతీనగర్, మింట్ కాంపౌండ్‌లోని ఇందిరమ్మ క్యాంటీన్లలో (Indiramma Canteens) ఈ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ప్రారంభ దశలో 60 ప్రాంతాల్లోని ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తదుపరి దశలో భాగ్యనగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో జీహెచ్ఎంసీ (GHMC) బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని విస్తరించింది.

Details

రోజుకూ 25,000 మందికి మిల్లెట్ టిఫిన్స్

రోజుకూ సుమారు 25,000 మందికి మిల్లెట్ టిఫిన్స్ (Millet Tiffins) అందించనుంది. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ వంటి సరళ పోషకాహార భోజనాలు ఉంటాయి. ఒక్కో ప్లేట్ ఖర్చు రూ.19గా ఉంటే, అందులో రూ.14 జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఈ క్యాంటీన్లు వారంలో ఆరు రోజులపాటు పనిచేయనున్నాయి, ఆదివారం సెలవు. ఇప్పటికే నగరంలో 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజనం కూడా రూ.5కే అందించనుంది.