Page Loader
UGC-NET 2024 : UGC-NET 2024 పరీక్ష కోసం కొత్త తేదీల ప్రకటన
UGC-NET 2024 : UGC-NET 2024 పరీక్ష కోసం కొత్త తేదీల ప్రకటన

UGC-NET 2024 : UGC-NET 2024 పరీక్ష కోసం కొత్త తేదీల ప్రకటన

వ్రాసిన వారు Stalin
Jun 29, 2024
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

UGC-NET 2024 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 21,సెప్టెంబర్ 4 మధ్య తిరిగి నిర్వహించనున్నట్లు NTA నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది. UGC-NET జూన్ 2024 సైకిల్ పరీక్ష గతంలో పెన్ , పేపర్ (ఆఫ్‌లైన్) మోడ్‌లో జరిగింది. అయితే, ఇది ఇప్పుడు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించనుంది. యూజీసీ నెట్ పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్సెంటర్ ఆధ్వర్యంలో నివేదిక ఇచ్చింది.

వివరాలు 

యూజీసీకి నివేదిక 

జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం (నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్- NCTAU) యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత కాపాడుకోవడం కోసమే పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించింది. యూజీసీ నెట్‌లో అర్హత సాధించినవారు జూనియర్ రిసెర్చ్ ఫెల్లోషిప్‌కు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాలను కల్పిస్తారు. యూజీసీ నెట్ పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-2024 పరీక్షను కూడా యూజీసీ వాయిదావేసింది

వివరాలు 

వాయిదా ఎందుకంటే

అంతకుముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. దేశవ్యాప్తంగా జూన్‌ 25, 26, 27 తేదీల్లో సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్ష వాయిదాపడింది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, యూనివర్సిటీలలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే యూనివర్సిటీలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాధిస్తారు. తాజాగా 'నెట్' పరీక్షల కొత్త షెడ్యూలుతోపాటు ఇతర పరీక్షల షెడ్యూలును ఎన్టీఏ విడుదల చేసింది.