NEET-PG: సోమ,మంగళవారంలోగా నీట్ పీజీ 2024 పరీక్ష తేదీలు.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ ( నీట్ పీజీ) 2024 పరీక్ష తేదీలను సోమవారం, మంగళవారంలోగా ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జూన్ 22 న అర్థరాత్రి పోస్ట్‌లో, పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షను కేవలం గంటల తర్వాత ఆదివారం (జూన్ 23) నిర్వహించాల్సి ఉంది. విద్యార్థుల ప్రయోజనాల కోసం , పరీక్షా ప్రక్రియ పవిత్రతను కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు. అవకతవకలు, పేపర్ లీకేజీల ఆరోపణల నేపథ్యంలో నీట్-యూజీ పరీక్ష రద్దుపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై కూడా మంత్రి ఎదురుదాడికి దిగారు. 'వాళ్లు గందరగోళం,కొనసాగాలని ఆశిస్తున్నారని దుయ్య బట్టారు.
రాహుల్ గాంధీ మైక్రో ఫోన్ ఆఫ్
కాంగ్రెస్ చర్చించాలనుకుంటున్న సమస్యను రాష్ట్రపతి స్వయంగా ప్రస్తావించారు. ప్రక్రియలో సవాళ్లు , లోపాలను అంగీకరించారు . తాము వాటిని పరిశీలించవలసి ఉంటుంది. వారు ఈ విషయం అందరి నోళ్లలో నానుతూ ఉండాలని వారు కోరుకుంటున్నారు" అని ఆయన అన్నారు. శుక్రవారం లోక్‌సభలో నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మైక్రోఫోన్ ఆఫ్ చేశారని ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ X లో ఒక వీడియోను కూడా పంచుకుంది. దీనిలో గాంధీ స్పీకర్ ఓం బిర్లాను మైక్రోఫోన్‌కు యాక్సెస్ ఇవ్వమని కోరడం చూడవచ్చు. ప్రతిపక్షాలు, ప్రభుత్వం రెండూ కలిసి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆయన కోరారు. అందుకే నీట్‌పై చర్చకు పిలుపునిచ్చానని గాంధీ చెప్పారు .
NEET-UG పరీక్ష ఫలితాలపై వివాదం
మే 5న 4,750 కేంద్రాల్లో జరిగిన నీట్-యూజీ పరీక్షలో చీటింగ్, ప్రశ్నాపత్రం లీక్‌ల ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు-67 మంది-పూర్తిగా 720 స్కోర్ చేశారు. అయితే 1,563 మంది అభ్యర్థులు కోల్పోయిన సమయానికి గ్రేస్ మార్కులు పొందారు. ఈ గ్రేస్ మార్కులు తర్వాత రద్దు చేశారు. అంతేకాకుండా, ఫలితాలను జూన్ 14న ప్రకటించాలని భావించారు. అయితే సమాధాన పత్రాల మూల్యాంకనాలను ముందుగానే పూర్తి చేయడం వల్ల 10 రోజుల ముందుగానే ప్రకటించారు.
సీబీఐ అరెస్ట్ చేసింది
ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) గురువారం పాట్నాలో తొలి అరెస్టు చేసింది. ANI ప్రకారం, ఆ వ్యక్తులను బల్దేవ్ కుమార్, అలియాస్ చింటూ , ముఖేష్ కుమార్‌గా గుర్తించారు. శనివారం మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్‌గా గుర్తించారు. ఇతను హజారీబాగ్‌లోని నీట్ పరీక్షకు సిటీ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశాడు.