
Train Accident: న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం యూపీలోని ఇటావా సమీపంలో ఉన్న ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి.
అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. అధికారుల తెలిపిన ప్రకారం, రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళుతున్నప్పుడు, స్లీపర్ కోచ్‌లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించారు.
దీంతో స్టేషన్ మాస్టర్ రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించి రైలును నిలిపివేశారు. అనంతరం స్లీపర్ కోచ్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు.
మంటలు అంటుకున్న వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, రైలులో సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
Fire breaks out in a coach of New Delhi-Darbhanga Express near UP's Etawah, no casualty reported: Railway official
— Press Trust of India (@PTI_News) November 15, 2023