
PM Modi: రేపటి నుంచి కొత్త జీఎస్టీ.... జీఎస్టీ సంస్కరణలపై మోదీ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ప్రజలకు ప్రసంగిస్తూ, నవరాత్రి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు ప్రారంభమవుతుంది. ఈ రోజు కేవలం పండుగ వేడుకలకు మాత్రమే కాదు, దేశ ఆర్థికాభివృద్ధి, పన్ను సంస్కరణలలో కీలక మైలురాయిగా ఉంది.
Details
మోడీ వెల్లడించిన అంశాలివే:
రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలు అవుతాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేస్తున్న ఒక ప్రగతి అడుగు. జీఎస్టీ మార్పులతో పేద, మధ్యతరగతి పౌరులకు ఆదాయం మిగులుతుంది. పండుగల సమయంలో దేశ ప్రజలకు నేరుగా లాభం కలుగుతుందని, జీఎస్టీ సంస్కరణలతో భారత ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందని స్పష్టం చేశారు. సాధారణ పౌరులకు డబ్బు ఆదా అవుతుందని, ఇది తీపికబురుగా చెప్పొచ్చని పేర్కొన్నారు.
Details
2017లో జీఎస్టీ ప్రారంభాన్ని గుర్తుచేసిన మోదీ
అప్పట్లో వివిధ రకాల పన్నులు ఉన్నాయి; రాష్ట్రాల మధ్య వస్తువులు తరలించే సమయంలో కూడా పన్నులు చెల్లించాల్సి ఉండేది. జీఎస్టీ మార్పులు FDI ప్రోత్సాహానికి దారితీస్తాయి. గతంలో, ఉదాహరణకు **బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తువులు తీసుకువెళ్ళడం చాలా కష్టమైన పని, టాక్స్, టోల్ వల్ల వినియోగదారులపై భారం పడేది. ఇప్పుడు, ఇళ్ళు, బండీలు, ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయడంలో గణనీయంగా ఆదా అవుతుంది. ప్రధాని మోడీ ప్రసంగం ద్వారా, కొత్త జీఎస్టీ రేట్ల అమలు దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురానుందన్నదే స్పష్టమైంది.