ICU Admit: రోగిని ఐసీయూలో చేర్చుకోవాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే.. కొత్త మార్గదర్శకాలు జారీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రమాదంలో తీవ్ర గాయపడి రోగి పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితుల్లో ఐసీయూలో చేర్చి డాక్టర్లు చికిత్స అందిస్తారు.
ఐసీయూలో చేర్చుకోవడంపై రోగి బంధువుల ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
అయితే ఐసీయూలో చేరికపై 24 మంది నిపుణులు చర్చించి కొత్త మర్గదర్శకాలను జారీ చేశారు.
ఒకవేళ రోగి తీవ్ర అస్వస్థతకు గురై రోగి బంధువులు నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోలేరని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీయూ ఆడ్మిషన్లపై ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.
ముఖ్యంగా రోగి మనుగడపై ప్రభావం చూపకుంటే ఐసీయూలో ఉంచడం వ్యర్థమని నిపుణుల బృందం సిఫార్సు చేసింది.
Details
జీవించే అవకాశం లేనప్పుడు ఐసీయూలో చేర్చకోకూడదు
జీవించే అవకాశం లేనప్పుడు ఐసీయూలో చేర్చుకోకూడదని స్పష్టం చేశారు.
అదే విధంగా విపత్తు పరిస్థితులు, మహమ్మరి, వనరులు పరిమితంగా ఉన్న సమయంలో రోగిని ఐసీయూలో ఉంచడానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఇంటెన్సివ్ మానిటరింగ్, ఆర్గాన్ సపోర్టు, వైద్య పరిస్థితి క్షీణతకు అవకాశం ఉన్న వ్యాధులకు మాత్రమే ఐసీయూలో చేర్చుకోవాలని సూచించింది.
ఇక కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ ఇన్‌స్టెబిలిటీ, పెద్ద సర్జరీలు చేయించుకున్న రోగులను కూడా ఐసీయూ అడ్మిన్ చేసుకోవచ్చని పేర్కొంది.