Page Loader
కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌
సమయం దాటితే మైక్‌ కట్‌

కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 18, 2023
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023 రేపట్నుంచి కొత్త పార్లమెంట్‌లోనే కొనసాగనున్నాయి. ఈ మేరకు సభ్యుల మైక్‌లన్నీ ఆటోమేటెడ్‌ సిస్టమ్‌తో పని చేస్తాయని తెలుస్తోంది. అంటే నిర్ణీత సమయంలో ఫోన్ కాల్ కట్ అయ్యే మాదిరిగానే సభలోనూ మైక్ కట్ కానుంది. కొత్త పార్లమెంట్‌ భవనంలో అధునాతన ఫీచర్లను పొందుపర్చినట్లు సమాచారం. భద్రతా కోసం బయోమెట్రిక్ వ్యవస్థను సిద్ధం చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చే ప్రతిపక్ష సభ్యులు నిరసనలు తెలపేందుకు వీల్లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త పార్లమెంట్‌లో కూడా పేపర్‌లెస్‌ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రతి ఎంపీకి టాబ్లెట్ కంప్యూటర్ ఇవ్వనున్నారు. జర్నలిస్టుల కోసమూ కఠినమైన ప్రవేశ నిబంధనలను సిద్ధం చేశారు. ఆరు ద్వారాలకు గజ, గరుడ, డేగ వంటి పేర్లు పెట్టారు.

details

విపక్షాల ఆరోపణల నేపథ్యంలో లేటెస్ట్ టెక్నాలజీ

భారత ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదనే విపక్ష సభ్యుల ఆరోపణల మధ్య ఈ లేటెస్ట్ టెక్నాలజీ సిస్టమ్‌ వస్తుండటం కొసమెరుపు. గతంలో జరిగిన సమావేశాల్లో అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదికను ఊటంకిస్తూ పార్లమెంటరీ కమిటీ విచారించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. గత నెలలో జరిగిన పార్లమెంట్ సెషన్‌లో మణిపూర్ అంశంపై తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం తమ వాణి వినిపించకుండా మైక్‌లు కట్‌ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక దశలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సైతం ఈ విషయంపై మండిపడ్డారు. తాను మాట్లాడేందుకు కేంద్రం మైక్‌ ఇవ్వకుండా అవమానించిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.