LOADING...
Pawan Kalyan: పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం
పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం

Pawan Kalyan: పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు. కొత్త విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికారి నుంచి అన్ని స్థాయిల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ విధానంలో రెండు-మూడు గ్రామ పంచాయతీల బాధ్యత ఒకే కార్యదర్శి నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా కార్యదర్శులు నియమిస్తామని వివరించారు. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం పంచాయతీలలో అమలు చేస్తున్న విధానాలు, లోపాలు, మార్పులు, అవసరాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాధారణ పరిపాలన, ఆర్థిక, న్యాయ శాఖల ఉన్నతాధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు.

Details

ప్రధాన అంశాలివే

ప్రస్తుత లోపభూయిష్ట పరిపాలన వ్యవస్థలు పంచాయతీల ప్రగతికి అడ్డంకులుగా మారాయి. 48 ఏళ్ల క్రితం విధించబడిన సిబ్బంది నమూనా ఇప్పటికీ అమల్లో ఉంది. గత క్లస్టర్ విధానంలో సమస్యలు ఉన్నాయి. పంచాయతీల గ్రేడ్ నిర్ణయంలో ఇప్పటికే ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. కొత్త విధానంలో జనాభా, మండల కేంద్రం, గిరిజన, గిరిజనేత ప్రాంతం, ఆదాయ అంశాలను విశ్లేషించి నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నాం. పంచాయతీలలో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో పౌర సేవలు వేగంగా అందేలా పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలను అందించడానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.