New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రణాళికలను రచిస్తోంది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీతో పాటు మార్గదర్శకాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. త్వరలోనే అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రేషన్ కార్డులపై అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలను ముద్రించారు.
కొత్త కార్డులివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులివ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో మొత్తం 1.48 రేషన్ కార్డులు ఉన్నా, వాటిలో 90 లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. వైసీపీ ప్రభుత్వం 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, గడిచిన ఐదేళ్లలో 1.48 కోట్లు పెరిగాయి. ఇప్పటికే కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు 78వేలకు చేరాయి. వీటిన్నింటిని ఆ ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం 3.36 లక్షల దరఖాస్తులు
ఇక మార్పులు, చేర్పుల కోసం మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఇక ప్రభుత్వం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 1,36,420 కుటుంబాలు ఆరు నెలలుగా పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు. ఒకవేళ వాటిని తొలగిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.90 కోట్ల వరకు ఆదా కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. మళ్లీ తెల్లకార్డులు, గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చిన దాదాపు సగం భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.