#NewsBytesExplainer: రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. సస్టెయినబుల్ హోమ్స్
ఈ వార్తాకథనం ఏంటి
2025 నాటికి భారత రియల్ ఎస్టేట్ రంగం సస్టెయినబుల్ హోమ్స్ పై మరింత దృష్టి సారిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలు, కొనుగోలుదారుల మారుతున్న అభిరుచులు.. ఇవన్నీ కలిసి పర్యావరణహిత భవనాలను ప్రధాన స్రవంతిగా మార్చుతున్నాయి. తాజా CII-కాలర్స్ నివేదిక ప్రకారం,ఈ ఏడాది ప్రారంభమవుతున్న కొత్త ప్రాజెక్టులలో దాదాపు 25 శాతం గ్రీన్ సర్టిఫికేషన్ పొందుతున్నాయి. 2030 నాటికి ఇది 50 శాతం, 2047 నాటికి 75 శాతం వరకు పెరగవచ్చని అంచనా. సస్టెయినబుల్ భవనాలు అంటే కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం కావు. ఇవి ఎనర్జీ, నీరు, నిర్మాణ సామగ్రి సమర్థ వినియోగం, ఆరోగ్యకరమైన జీవనశైలి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి.
వివరాలు
ఈ ఏడాదిలోనే ఈ సర్టిఫికేట్లు పొందిన 1,200కు పైగా ప్రాజెక్టులు
ప్రస్తుతం ఈ గ్రీన్ బిల్డింగ్స్‌కి IGBC, GRIHA, LEED, EDGE, WELL వంటి అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేషన్లు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే 1,200కు పైగా ప్రాజెక్టులు ఈ సర్టిఫికేట్లు పొందాయి. ఢిల్లీలో లోధా, గోద్రేజ్ వంటి డెవలపర్లు తమ 80 శాతం ప్రాజెక్టులను LEED సర్టిఫైడ్ చేయగా, హైదరాబాద్‌లో మై హోమ్ భూజ, ప్రెస్టీజ్ హై ఫీల్డ్స్ వంటి ప్రాజెక్టులు GRIHA 4-5 స్టార్ రేటింగ్స్ సాధించాయి. ఇక నెట్-జీరో ఎనర్జీ బిల్డింగ్స్ ఈ రంగంలో కొత్త మలుపుగా మారుతున్నాయి. సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ భవనాలు స్వతహాగానే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాయి.
వివరాలు
సాధారణ గృహాలతో పోలిస్తే 10-15 శాతం ఎక్కువ ధర
2030 నాటికి సుమారు 10 శాతం భవనాలు నెట్-జీరో స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సస్టెయినబుల్ డిజైన్‌లో నీటి సంరక్షణ కూడా కీలక అంశం. రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, గ్రేవాటర్ రీసైక్లింగ్, లో-ఫ్లో ఫిక్చర్స్ వంటి పద్ధతుల ద్వారా సుమారు 40 శాతం నీరు ఆదా చేయవచ్చు. అంతేకాక, స్మార్ట్ టెక్నాలజీలు ఈ భవనాల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ దిశలో పలుపులు విరుస్తోంది. గ్రీన్ హోమ్స్ ఇప్పుడు సాధారణ గృహాలతో పోలిస్తే 10-15 శాతం ఎక్కువ ధర పలుకుతున్నప్పటికీ, కొనుగోలుదారులు వాటిని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నారు. ఫలితంగా, సస్టెయినబుల్ హౌసింగ్ మార్కెట్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది.