LOADING...
Delhi: పేలుడుకు పది రోజుల ముందు నూహ్‌లోనే బాంబర్‌ ఉమర్‌..! 
పేలుడుకు పది రోజుల ముందు నూహ్‌లోనే బాంబర్‌ ఉమర్‌..!

Delhi: పేలుడుకు పది రోజుల ముందు నూహ్‌లోనే బాంబర్‌ ఉమర్‌..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ కొన్ని రోజుల పాటు హరియాణా రాష్ట్రంలోని నూహ్‌ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పేలుడు ఘటనకు దాదాపు పది రోజుల ముందు అక్కడి హిదాయత్‌ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, నవంబర్‌ 10 అర్ధరాత్రి వరకూ అదే ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాత్రి సుమారు ఒక గంట సమయంలో,తన ఐ-20 కారులో పేలుడు పదార్థాలను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. మొదటగా ఫిరోజ్‌పుర్‌లోని ఓ ఏటీఎం వద్ద నగదు డ్రా చేయాలని ఉమర్‌ ప్రయత్నించినా, అది సాధ్యం కాకపోవడంతో చివరికి నూహ్‌కు వచ్చి ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నట్లు దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి.

వివరాలు 

భారీగా సొమ్మును సమీకరించిన ఉమర్‌ 

అతడు ఆ ఇంట్లో ఉన్న విషయమే చుట్టుపక్కల వారికి తెలియకుండా ఉండిపోయింది. స్థానిక ఇంటెలిజెన్స్‌ శాఖకూ ఏరకమైన అనుమానం రాలేదు. అయితే, దగ్గరలోని ఒక అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్‌కు అమర్చిన సీసీ కెమెరాల్లో ఉమర్‌ కారు ఆ కాలనీలోకి వస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. డాక్టర్‌ ఉమర్‌ పేలుడు దాడికి ముందు వివిధ అక్రమ మార్గాల ద్వారా సుమారు రూ.20 లక్షల వరకు సొమ్ము కూడబెట్టినట్టు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అదే డబ్బుతో నూహ్‌ మార్కెట్లో నగదు చెల్లించి పెద్ద మొత్తంలో ఎరువులను కొనుగోలు చేశాడు. వీటినే ఆయన బాంబుల తయారీలో ఉపయోగించినట్టు తెలుస్తోంది.