YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు సిబ్బందిపై తాజాగా చర్యలు ప్రారంభమైనట్టు సమాచారం. వివరాల ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్, అలాగే సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై అధికారికంగా కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరు అధికారులు ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువడిన అనంతరం ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
Details
మొత్తం 22 మంది సాక్షుల విచారణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఈ తప్పుడు కేసుల దర్యాప్తు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దాదాపు ఎనిమిది నెలలపాటు విచారణ జరిపి, మొత్తం 22 మంది సాక్షులను విచారించారు. విచారణ అనంతరం తప్పుడు కేసులపై 'క్లోజర్ రిపోర్ట్' సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో, ఆ తర్వాత ఇద్దరు పోలీసు అధికారులపై అధికారికంగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ పరిణామంతో గత కొన్నేళ్లుగా చర్చకు దారితీసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త దిశలోకి వెళ్లింది. న్యాయ ప్రక్రియలో ఇది ఒక కీలక మలుపుగా మారిందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.