Loading...
New Vande Bharat Express: విశాఖ-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు.. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
విశాఖ-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు.. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

New Vande Bharat Express: విశాఖ-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు.. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం నుంచి తిరుపతికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ఎంపీలు చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. దీంతో విశాఖ-తిరుపతి మధ్య కొత్త వందేభారత్ రైలు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రైలు మార్గం, మధ్యలో నిలిచే స్టేషన్లు, రాకపోకల సమయాలను రైల్వే అధికారులు దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

వివరాలు 

వచ్చే ఏడాది స్లీపర్ రైలుపై నిర్ణయం

ప్రస్తుతం విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

వీటిలో రెండు రైళ్లు సికింద్రాబాద్‌కు, ఒక్కొక్కటి భువనేశ్వర్, దుర్గ్ నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.

మరోవైపు విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు రాత్రి వేళల్లో వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని ప్రజాప్రతినిధులు కోరారు.

అయితే ఈ ప్రతిపాదన అమలుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది స్లీపర్ రైలుపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈలోగా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పగటిపూట విశాఖ-తిరుపతి మధ్య సాధారణ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు.

వివరాలు 

ప్రతిపాదిత రైలు వేళలు ఇవే..

రైల్వే శాఖ సూత్రప్రాయంగా సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం.. కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:35 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది.

ఉదయం 7:00 గంటలకు సామర్లకోట, 7:40 గంటలకు రాజమండ్రి, 9:30 గంటలకు విజయవాడ, 10:55 గంటలకు ఒంగోలు, మధ్యాహ్నం 12:15 గంటలకు నెల్లూరులో ఆగుతుంది.

అనంతరం మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:55 గంటలకు తిరుపతిలో రైలు బయలుదేరుతుంది.

సాయంత్రం 4:48 గంటలకు నెల్లూరు, 6:08 గంటలకు ఒంగోలు, రాత్రి 7:25 గంటలకు విజయవాడ, 9:23 గంటలకు రాజమండ్రి, 10:03 గంటలకు సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

చివరగా రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకునేలా ప్రాథమిక షెడ్యూల్‌ను రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రతిపాదిత రైలు వేళలు ఇవే..

అయితే ప్రస్తుతం వెల్లడైన సమయాలు ప్రతిపాదిత షెడ్యూల్‌లో భాగమే. రైలు ప్రయాణ వేళలు, హాల్టింగ్‌లపై రైల్వే శాఖ మరింత అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది.

అనంతరం పూర్తి వివరాలతో అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

ఈ రైలు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, నెల్లూరు మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

ADVERTISEMENT