LOADING...
New year celebration 2026: న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డులు బద్దలవుతాయా?
న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డులు బద్దలవుతాయా?

New year celebration 2026: న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డులు బద్దలవుతాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అంటే మద్యం అమ్మకాలు భారీగా నమోదవడం సాధారణమే. దసరా,న్యూ ఇయర్ వంటి ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతుంటుంది. ప్రతి ఏడాది అమ్మకాల పరంగా కొత్త రికార్డులు నమోదవుతుండగా, ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా గత ఏడాది గణాంకాలు తిరగరాయబడతాయా? అనే అంశంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మరి గత ఏడాది న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయో ఒకసారి పరిశీలిద్దాం.

వివరాలు 

గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో పెరిగిన మద్యం విక్రయాలు 

సాధారణంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలనే ఉద్దేశంతో మద్యం ప్రియులు కొంచెం ఎక్కువగానే కొనుగోళ్లు చేస్తుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలకు సిద్ధమవుతారు. న్యూ ఇయర్ 2025 వేడుకల నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల్లోనే ప్రజలు మొత్తం రూ.684 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. 2024 డిసెంబర్ 30న ఒక్క రోజే రూ.402 కోట్ల మద్యం అమ్ముడవ్వగా, డిసెంబర్ 31న అమ్మకాలు రూ.282 కోట్లకు చేరాయి.

వివరాలు 

2023లో రూ.1510 కోట్ల విక్రయాలు 

ఇక నూతన సంవత్సరానికి ముందు చివరి ఏడు రోజుల్లో తెలంగాణలో దాదాపు రూ.1700 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య రూ.1510 కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మందుబాబులు ఆ రికార్డులను బద్దలు కొడతారా? అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. న్యూ ఇయర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మద్యం షాపుల్లో ముందుగానే భారీగా స్టాక్ నిల్వ చేశారు. ఈసారి గత ఏడాదికంటే ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మందుబాబులకు ఊరటనిచ్చేలా స్పెషల్ ఆర్డర్స్ జారీ చేసింది.

Advertisement

వివరాలు 

 డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రత్యేక తనిఖీలు: ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 

డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పబ్‌లు, క్లబ్‌లు, అనుమతి పొందిన ఈవెంట్లు, పర్యాటక ప్రాంతాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏ-4 వైన్స్ షాపుల్లో మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అవకాశం కల్పించారు. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయాలు చేయరాదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పష్టంగా తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు.

Advertisement